Varanasi | మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ వివాదంపై క్లారిటీ ..తెలుగు వెర్షన్‌కు కొత్త పేరు ఫిక్స్?
Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “వారణాసి” పై అంచనాలు మొదటి నుంచే ఆకాశాన్ని తాకుతున్నాయి.
Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “వారణాసి” పై అంచనాలు మొదటి నుంచే ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే టైటిల్ రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే అనుకోని వివాదం చుట్టుముట్టింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సమస్యకు రాజమౌళి టీమ్ ఓ సొల్యూషన్ కనుగొన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. “వారణాసి” టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన వెంటనే, రామ బ్రహ్మ హనుమ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ పేరును ముందే రిజిస్టర్ చేసుకున్నామని తెలిపింది.
ఈ సంస్థకు చెందిన దర్శకుడు సీహెచ్. సుబ్బారెడ్డి కూడా ఇదే టైటిల్‌తో సినిమా చేయనున్నట్లు చాలాకాలంగా చెప్పినట్టు సమాచారందీంతో రాజమౌళి టీమ్‌కి చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో, టైటిల్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం, వివాదం పూర్తిగా తెలుగు వెర్షన్ టైటిల్‌కే సంబంధించినదట. అందువల్ల రాజమౌళి టీమ్ తెలుగులో టైటిల్‌ను స్వల్పంగా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం ఒరిజినల్ పేరు “వారణాసి” నే కొనసాగించే అవకాశం ఉంది.అంటే టైటిల్‌ను పూర్తిగా మార్చకుండా, తెలుగు మార్కెట్లో మాత్రమే స్వల్ప మార్పుతో సమస్యను పరిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి ఇప్పటివరకు ప్రయత్నించని కొత్త కాన్సెప్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇది గ్లోబ్ ట్రాటర్ అడ్వెంచర్‌తో పాటు టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ కలపిన భారీ కథ.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈవెంట్లో మహేష్ బాబు లుక్, టైటిల్ డిజైన్, కాన్సెప్ట్ టీజర్లను విడుదల చేశారు. మహేష్ కొత్త అవతారం అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. ప్రియాంక చోప్రా (మందాకినిగా), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ పాత్రలో) కనిపించి అలరించనున్నారు. ఈ భారీ కాంబినేషన్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్ మరింత ప్రెస్టీజియస్ అయింది.సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, 2027 సమ్మర్లో గ్రాండ్ రిలీజ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

