Varanasi Title | రాజమౌళి – మహేశ్ బాబు సినిమా టైటిల్ వివాదం క్లియర్.? తెలుగులో మార్పు.!
Varanasi Title | ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
Varanasi Title | ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. 2027లో రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘వారణాసి’ అనే టైటిల్‌ను తెలుగులో గతంలోనే వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ టైటిల్ వివాదం పరిష్కారమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వేరే నిర్మాణ సంస్థ కేవలం తెలుగులో మాత్రమే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోవడంతో, చిత్ర బృందం (రాజమౌళి టీమ్) తెలుగు వెర్షన్ టైటిల్లో స్వల్ప మార్పు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానున్నందున, తెలుగులో మాత్రం ‘రాజమౌళి వారణాసి’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇతర అన్ని భాషల్లో మాత్రం ‘వారణాసి’ అనే ఒరిజినల్ టైటిల్‌నే కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఖలేజా సినిమా టైంలో కూడా ఇలా టైటిల్ వివాదం ఎదుర్కోగా.. మేకర్స్ ఆలోచించి మహేశ్ ఖలేజా అనే పేరుతో విడుదల చేయగా.. వివాదం సద్దమణిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

