Sabari | స్టైలిష్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ బైక్ రైడ్.. శబరి ప్రపంచం ఇలా.. వీడియో
వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం శబరి (Sabari). మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మేకర్స్ శబరి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం శబరి (Sabari). మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మేకర్స్ శబరి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ బైక్‌పై స్టైలిష్ గా రైడ్ చేస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటుండగా.. మరోవైపు కూతురితో కలిసి అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికొస్తుంది. అయితే ఆ ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతుడు ప్రవేశిస్తాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగిందనేది వీడియోలో సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్. ఈ వీడియోతో సినిమాలో థ్రిల్లింగ్‌కు గురి చేసే అంశాలున్నట్టు చెబుతున్నాడు.
శబరి చిత్రంలో గణేశ్ వెంకట్రామన్, మిమే గోపి, సునయన, శశాంక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మహర్షి కొండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబి కృతిక, రాజశ్రీ నాయర్, భద్రమ్, ఫణి, కృష్ణ తేజ, ప్రభు, అర్చన అనంత్, కేశవ్ దీపక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The MONSTER Enters🔥
Here it is, Presenting the astounding #WorldOfSabari💥
Thrilling Soon⏳@Varusarath5 @anilkatz @MahendraProducr #NaniChamidisetty @mimegopi @ActorShashank @Shrivatsav3 @GopiSundarOffl @dharmi_edits @talk2ganesh #Ashishtejapulala pic.twitter.com/iLPcfy1Onk
— BA Raju's Team (@baraju_SuperHit) January 10, 2023
శబరి ప్రపంచం ఇలా.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

