Varalaxmi Sarathkumar | స్త్రీజాతికి ఆయనిచ్చిన గౌరవం ఇది.. ఆ ఆనవాయితీని బ్రేక్ చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త
పెళ్లి తర్వాత అమ్మాయిల ఇంటిపేర్లు మారటం.. తమ పేర్ల వెనుక భర్తల పేర్లు యాడ్ అవ్వడం ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే.. వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త అయిన నికోలయ్ సచ్దేవ్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు. తాజాగా తన పేరును ‘నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్'గా మార్చుకొని చర్చనీయాంశంగా నిలిచారాయన.
Varalaxmi Sarathkumar | పెళ్లి తర్వాత అమ్మాయిల ఇంటిపేర్లు మారటం.. తమ పేర్ల వెనుక భర్తల పేర్లు యాడ్ అవ్వడం ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే.. వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త అయిన నికోలయ్ సచ్దేవ్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు. తాజాగా తన పేరును ‘నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్’గా మార్చుకొని చర్చనీయాంశంగా నిలిచారాయన. ఈ విషయంపై రీసెంట్గా వరలక్ష్మి మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పేం లేదు. అయితే.. నా భర్త నికోలయ్ జీవితం మాత్రం మారింది. నాకోసం ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.
తన పేరులో నా పేరును కలుపుకొని నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మి శరత్‌కుమార్‌గా మారారు. కెరీర్ పరంగా నేను ఇంకా ఎంతో సాధించాలనే ఆరాటం, తపన ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. వర్క్ విషయంలో నాలో స్ఫూర్తి నింపుతున్నాయన. నిజానికి నాకు పెళ్లిపై పెద్ద సదాభిప్రాయం లేదు. కానీ నికోలయ్ పరిచయంతో నా అభిప్రాయం మారింది. పెద్ద అంగీకారంతో ఓ మంచి మనిషిని పెళ్లి చేసుకున్నందుకు గర్విస్తున్నాను. తన పేరులో నా పేరును కలుపుకోవడంలో నాపై ఆయనకున్న ప్రేమ, స్త్రీజాతికి ఆయనిచ్చే గౌరవం తేటతెల్లమవుతున్నది.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు వరలక్ష్మి శరత్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

