‘వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి’.. ‘ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?’.. ‘అది దెయ్యాల కొంప’.. ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ వుండగా ‘వళరి’ మూవీ ట్రైలర్ మొదలైంది. హారర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్లో రితికా సింగ్ నటన బావుంది.. శ్రీరామ్ పాత్ర కీలకం అని తెలుస్తున్నది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకుడు హరీశ్‌శంకర్ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందిచారు. శ్రీరామ్, రితికా సింగ్ ముఖ్యపాత్రలు పొషించిన ఈ చిత్రానికి కె.సత్యసాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎం.మృతిక సంతోషిణి దర్శకురాలు. ‘ ‘వళరి’ అనేది ఓ ఆయుధం. అది బూమరాంగ్‌లా పనిచేస్తుంది. మనం చేసే కర్మ తిరిగి అది మన దగ్గరకే వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. అందరికీ నచ్చే సినిమా ఇది’ అని చెప్పారు దర్శకురాలు మృతిక సంతోషిణి.