‘వకీల్‌సాబ్’ బాధ్యతను పెంచింది

‘సినిమా చేస్తే మొదట సంతృప్తికలగాలి. ఆ తర్వాతే డబ్బుల గురించి ఆలోచించాలి. ‘వకీల్‌సాబ్’తో ఈ రెండు విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నాం. ప్రేక్షకుల మనసుల్ని తాకే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం ఇటీవలే విడుదలైంది. రెండోవారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘థియేటర్, టీవీ, ఓటీటీల ద్వారా నిర్మాతలకు డబ్బులు వస్తుంటాయి. అది ముఖ్యం కాదు. ఓ సినిమా ఎంతమంది ప్రేక్షకులకు చేరువయిందన్నదే ప్రధానమనుకుంటా.
ఈ కరోనా టైమ్‌లో కూడా చాలా మంది ఈ సినిమా చూస్తున్నారు. రిపీటెడ్‌గా ప్రేక్షకులొస్తున్నారు. మొదటి మూడు రోజులు థియేటర్ల వద్ద క్రౌడ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ప్రభుత్వం సీటింగ్ విధానంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రేక్షకులు సినిమా చూడాలన్నదే నా అభిమతం. ఎంత డబ్బు పెడితే సినిమాకు ఎంత తిరిగొస్తుందనే విషయంలో నాకు పక్కా లెక్కలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలోనూ సక్సెస్ అందుకున్నాం. దేశంలోని ఇతర భాషా పరిశ్రమలతో పోల్చితే తెలుగు ఇండస్ట్రీ సేఫ్‌గా ఉందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో 12 సినిమాలు రిలీజైతే అందులో ఐదారు చిత్రాలు విజయం సాధించాయి. ప్రతి సినిమా విజయం మనకో బాధ్యత నేర్పుతుంది. ‘వకీల్‌సాబ్’ విజయం మాపై మరింత బాధ్యతను పెంచింది’ అన్నారు. ‘ఈ సినిమా మహిళలకు దగ్గరైంది. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నిరూపించింది. ఈ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. మా టీమ్ అందరికి కరోనా సోకిందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా సోకిన వారు ఆ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు’ అని దర్శకుడు శ్రీరామ్‌వేణు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

