ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రంగ రంగ వైభవంగా’.. ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Ranga Ranga Vaibhavanga Movie On OTT | ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌తేజ్.. అదే జోష్‌ను తరువాతి సినిమాల్లో కంటీన్యూ చేయలేకపోతున్నాడు. గతేడాది విడుదలైన ‘కొండపోలం’ మూవీ.. అసలు వచ్చిందన్న విషయమే సగం మందికి తెలియకుండా వెళ్లిపోయింది.
Ranga Ranga Vaibhavanga Movie On OTT | ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌తేజ్.. అదే జోష్‌ను తరువాతి సినిమాల్లో కంటీన్యూ చేయలేకపోతున్నాడు. గతేడాది విడుదలైన ‘కొండపోలం’ మూవీ.. అసలు వచ్చిందన్న విషయమే సగం మందికి తెలియకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ సారి ఎలాగైన హిట్ సాధించాలని ‘రంగ రంగ వైభవంగా’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేక వైష్ణవ్ కెరీర్లో వరుసగా రెండో ఫేయిల్యూర్‌గా మిగిలింది. కథ, కథనం రోటీన్‌గా ఉండటంతో ప్రేక్షకులకు ఈ చిత్రం రుచించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రం గత రాత్రి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. నవీన్ చంద్ర కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ప్రస్తుతం వైష్ణవ్‌తేజ్ రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని చేస్తున్నాడు. దీనితో పాటిక సితార బ్యానర్లో ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండిట్లో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుందో తెలియల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

