Ranga Ranga Vaibhavanga | ‘రంగరంగ వైభవంగా’ ప్రీ టీజర్ రిలీజ్.. ఫుల్ టీజర్ ఎప్పుడంటే?
Ranga Ranga Vaibhavanga Teaser Release Date | డెబ్యూ సినిమాతో రికార్డులు సృష్టించాడు మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఉప్పెనలాంటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తరువాత వచ్చిన ‘కొండపొలం’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ సినిమాకు దర్శకత్వం వహించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ ప్రీ టీజర్‌ను విడుదల చేశారు.
లెటెస్ట్‌గా విడుదలైన ఈ ప్రీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టీజర్‌ను జూన్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా కేతికశర్మ హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన కొత్తగా లేదెంటి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.
Get ready for the ultimate celebration ❤️
Here's the pre teaser of #RangaRangaVaibhavanga 😍
▶️ https://t.co/h9KGknvolpTeaser releasing Tomorrow at 11am ✅#PanjaVaisshnavTej @TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial @BvsnP @SonyMusicSouth #RRVTeaser pic.twitter.com/lVodDnVCTk
— BA Raju's Team (@baraju_SuperHit) June 26, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

