Ranga Ranga Vaibhavanga | ‘రంగరంగ వైభవంగా’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న లీడ్ పెయిర్ కెమిస్ట్రీ!
Ranga Ranga Vaibhavanga Teaser | డెబ్యూ సినిమాతో రికార్డులు సృష్టించాడు మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఉప్పెనలాంటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తరువాత వచ్చిన ‘కొండపొలం’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ సినిమాకు దర్శకత్వం వహించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
‘నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. నన్నే ప్రేమిస్తావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో’ అంటూ కేతిక చెప్పే డైలాగ్స్‌తో టీజర్ మొదలయింది. ‘దీనమ్మ జీవితం మానవత్వం చచ్చిపోయింది భయ్యా’ అంటూ వైష్ణవ్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘రేయ్ బామ్మర్ది ఈ వంకరమాటలే వద్దనేది’ అంటూ ఆలి చెప్పే సంభాషణ నవ్విస్తుంది. టీజర్ మొత్తం సందడి సందడిగా సాగింది. చివర్లో వైష్ణవ్ ఫైటింగ్ బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టీజర్లోనే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమాలో ఏ లెవల్లో ఉంటుందో అని నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
కేతిక శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. చిత్రం నుండి విడుదలైన ‘కొత్తగా లేదెంటో’ పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

