Vadivelu | లెజెండరీ కమెడియన్ వడివేలు (Vadivelu) ఇంట విషాదం చోటుచేసుకుంది. వడివేలు సోదరుడు జగదీశ్వరన్ (Jagatheeshwaran) ఇవాళ ఉదయం మధురైలో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వడివేలు సోదరుడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన సమయంలో వడివేలు చెన్నైలో ఉన్నట్టు సమాచారం.
జగదీశ్వరన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వడివేలు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. జగదీశ్వరన్ పలు సినిమాల్లో కూడా నటించారు. ఆయన నటించిన సినిమాల్లో శింబు హీరోగా వచ్చినకాదల్ అళివతిల్లై ఒకటి. ఇటీవలే వడివేలు తల్లి మరణించిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే సోదరుడి మరణవార్తతో తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయిన వడివేలు కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రముఖులు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.