హెబ్బాపటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్లాక్ అండ్ వైట్’. ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకుడు. పద్మనాభ రెడ్డి, సందీప్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమా ఇది. విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన వస్తోంది. టి.సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అజయ్ అరసాడ సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుంది. తప్పకుండా చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.