ఉత్తేజ్‌కు సతీవియోగం

సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి (48) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుప్రతిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. బసవతారకం ఆసుపత్రి నుంచి పద్మావతి భౌతిక కాయాన్ని అల్లాపూర్ డివిజన్ ప్రాంతం గాయత్రీనగర్‌లోని ఉత్తేజ్ నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ నటులు ఉత్తేజ్ నివాసానికి చేరుకొని పద్మావతి పార్థివ దేహానికి నివాళులర్పించి ఉత్తేజ్ కుటుంబాన్ని ఓదార్చారు. అగ్ర నటుడు చిరంజీవి బసవతారకం ఆసుపత్రిలో ఉత్తేజ్‌ను పరామర్శించారు. చిరంజీవిని చూసి దుఃఖాన్ని ఆపుకోలేక ఉత్తేజ్ ఆయన్ని పట్టుకొని విలపించడం అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది. జీవిత రాజశేఖర్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ తదితరులు ఉత్తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. పద్మావతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే ఉత్తేజ్ స్థాపించిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలను పద్మావతే చూసుకునేవారు. ఫిల్మ్‌నగర్‌లోని మహప్రస్థానంలో పద్మావతి దహన సంస్కారాలను నిర్వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

