Regina | దిలీప్‌ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలిగీతం ‘ఫస్ట్‌కిస్’ శనివారం విడుదలైంది. అనూప్‌రూబెన్స్ స్వరపరచిన ఈ పాటను అనంత్‌శ్రీరామ్ రచించారు. తొలిముద్దు తాలూకు అనుభూతులను వ్యక్తం చేస్తూ ఈ పాట చక్కటి సాహిత్యంతో సాగింది. రామ్మిరియాల తనదైన శైలిలో ఆలపించారు.
‘ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలబోతగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ప్రకాష్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్, రచన-దర్శకత్వం: అర్జున్ సాయి.