కంటెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు
‘మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉంటుందని తాము ఊహించలేదంటూ చూసినవారిలో చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉంటుందని తాము ఊహించలేదంటూ చూసినవారిలో చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ని తీస్తున్నాననీ, వింటేజ్ పవర్‌స్టార్‌ని చూపించబోతున్నానని ముందునుంచీ చెబుతూ వచ్చాను. చెప్పింది చేసి చూపించాననే ఆత్మసంతృప్తితో ప్రస్తుతం నా హృదయం నిండిపోయింది. ఇప్పటివరకూ చూపించని కొన్ని అంశాలను ఈ మాస్ ఎంటైర్టెనర్‌లో చూపించాం. ఇందులోని ప్రతి పాత్రా ఆడియన్‌కి కనెక్టయింది.
సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టారు. ‘తొలిప్రేమ’ పాట సెకండాఫ్‌లో పెట్టడం ఆడియన్స్‌ని బాగా నచ్చింది. ఇది మా టీమ్ సమిష్టి విజయం’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు హరీశ్‌శంకర్. ఆయన దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ ప్రెస్మీట్లో హరీశ్‌శంకర్ మాట్లాడారు. ఆట ఆటకీ వసూళ్లు పెరుగుతున్నాయని, ఇది పవర్‌స్టార్ వన్ మ్యాన్ షో అనీ, కచ్చితంగా భారీ వసూళ్లు ఖాయమని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కళాదర్శకుడు ఆనంద్‌సాయి, గీత రచయిత చంద్రబోస్ తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

