తెలుగు చిత్రసీమలో ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మూవీస్‌కు చిరునామా సీనియర్ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్. నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. కె.విజయ్‌భాస్కర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘లవ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఉపశీర్షిక. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశాలతో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, దర్శకత్వం: కె.విజయ్‌భాస్కర్.