Usha Parinayam | ఉషా పరిణయం నుంచి ఆకాశానికే జాబిలి అందం లిరికల్ సాంగ్
Usha Parinayam | తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్. ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక.
Usha Parinayam | తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్. మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక.
విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తుండగా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చతెలుగమ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కాబోతుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
తాజాగా ఈ చిత్రం నుంచి ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం అంటూ కొనసాగే తొలి లిరికల్ సాంగ్ (ఓ ప్రేమగీతం) విడుదల చేశారు. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. ఆర్.ఆర్. ధ్రువన్ ఈ ప్రేమగీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రేమకథలో సరికొత్తగా వుండే విధంగా ఉషా పరిణయం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రేమకు నేనిచ్చే డెఫినేషన్. ఇదొక మంచి లవ్‌స్టోరి, సినిమా లవర్స్‌కు విందుభోజనం లా వుంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా సంగీతంలో ధ్రువన్ విశ్వరూపం చూస్తారన్నారు.
ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ, దర్శకత్వం-నిర్మాత :కె.విజయ్‌భాస్కర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

