Urvasivo Rakshasivo Movie | ఫన్, ఎంటర్టైనింగ్గా ‘ఊర్వసివో రాక్షసివో’ ట్రైలర్..!
Urvasivo Rakshasivo Trailer | అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా.. అల్లు శిరీష్‌కు కమర్షియల్ హిట్టు మాత్రం రావడంలేదు.
Urvasivo Rakshasivo Trailer | అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా.. అల్లు శిరీష్‌కు కమర్షియల్ హిట్టు మాత్రం రావడంలేదు. ప్రస్తుతం శిరీష్ ఆశలన్ని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం అకట్టుకుంటుంది. ‘తను కొరియన్ వెబ్ సిరీస్‌లా ట్రెండీగా ఉంటే.. నువ్వేంట్రా కార్తికదీపం సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్కలాగా పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతున్నావ్’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్స్ అలరిస్తున్నాయి. ట్రైలర్ మొత్తం ఫన్‌తో పాటు ఎంటర్టైనింగ్ ఉంది. ‘నేనిక్కడ నానా పటేకర్ రేంజ్లో పర్ఫామెన్స్ చేస్తుంటే.. నువ్వు కనీసం ఈటీవి ప్రభాకర్‌లా క్యాచ్ చేయలేకపోతున్నావ్’ అంటూ సునీల్ చెప్పే డైలాగ్స్ నవ్వులూ పూయిస్తున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి బాణీలు అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

