అల్లు శిరీష్ ‘ఊర్వసివో రాక్షసివో’ నుండి క్రేజీ అప్డేట్..!
Urvasivo Rakshasivo Movie | టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకుని 'ఊర్వసివో రాక్షసివో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
Urvasivo Rakshasivo Movie | టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఇటీవలే టైటిల్ పేరునూ మారుస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘కలిసుంటే’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను శనివారం సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అచ్చు రాజమణి స్వర పరిచిన ఈ పాటను కేకే రచించగా.. ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇది వరకే రిలీజైన మాయరే, దీంతానా సాంగ్‌లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది.
#Kalisunte ~ A romantic melody from #UrvasivoRakshasivo will be out tomorrow @ 4:00 PM 💓
🎹 #AchuRajamani
🎤 @ArmaanMalik22
📝 @kk_lyricist
🕺 @ChoreographerVJ@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir @DheeMogilineni #ViijayM @adityamusic @GA2Official pic.twitter.com/Wo3fFcdmCQ— Geetha Arts (@GeethaArts) October 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

