Kabza Movie On Ott | కన్నడ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కన్నడలో పర్వాలేదనిపించనా.. మిగితా భాషల్లో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కన్నడలో మాత్రమే కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. ఇతర భాషల్లో కనీసం థియేటర్ రెంటుకు సరిపడా టిక్కెట్లు కూడా తెగడం లేదు. చాలా వరకు ఏరియాల్లో ఈ సినిమాను తీసేశారు. తెలుగులో ఈ సినిమాను రూ.3 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా ఇక్కడ కేవలం కోటికి అటు ఇటుగా కలెక్షన్లు రాబ్బటింది. తెలుగులో హిట్టవ్వాలంటే మరో రెండు కోట్లు సాధించాల్సి ఉంటుంది. మరో మూడు రోజుల్లో దసరా రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా దాదాపు థియేటర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే కబ్జా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే వెళ్లిపోయేలా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాగా ఏప్రిల్ 14నుంచి ఈ సినిమా ముఖ్యమైన అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలకపాత్ర పోషించాడు. శ్రియా శరన్ హీరోయిన్గా నటించింది.