Upendra Next Movie | నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఉపేంద్ర ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలే అందకు నిదర్శనం. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. ఆయన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ కల్పితంలా కాకుండా నిజ జీవిత పాత్రలా అనిపిస్తుంటుంది. సమాజంలోని లోపాలను ఎత్తిచూపిస్తూ.. సెటైరికల్‌గా అదే సమయంలో ఎంటర్టైనింగ్ ఉండేలా ఆయన సినిమాలు రూపొందిస్తుంటాడు. ప్రముఖ సినిమా వెబ్సైట్ ‘ఐఎమ్‌డీబి’ టాప్-50 వరల్డ్ బెస్ట్ డైరెక్టర్లో ఉపేంద్రకు 17వ స్థానం ఇచ్చిందంటే.. ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే గతకొంత కాలంగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. ఆదే సమమంలో నటుడిగా తెగ బిజీ అయిపోయాడు. కాగా దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని ‘UI’ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. న్యూఇయర్ సందర్భంగా రిలీజైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు తెచ్చిపెట్టింది. అయితే గతకొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కాగా తాజాగా ‘కబ్జా’ ప్రమోషన్లలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఉపేంద్ర పంచుకున్నాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో ‘UI’ సినిమా గురించి మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో నా టేస్ట్ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చూస్తారు. ఈ సినిమా గనుక మీకు అర్ధమైతే మీరు సూపర్‌స్టార్ అవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాపై ఉపేంద్రకున్న కాన్ఫిడెంట్‌కు నెటీజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఉపేంద్ర సినిమాలను అర్థం చేసుకోవాలంటే మెదడుకు చాలా పని పెట్టాల్సి ఉంటుందని పలువురు నెటీజన్లు అభిప్రాయ పడుతుంటారు.
ఉపేంద్ర నటించిన కబ్జా మార్చి 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతుంది. కిచ్చా సుదీప్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్గా నటిస్తుంది.