Upendra | ఉపేంద్ర భార్యని ఎప్పుడైన చూశారా.. వారికి ఎంత మంది పిల్లలు అంటే..!
Upendra | సినిమాల్లో యూనిక్ కాన్సెప్ట్‌లు, డిఫరెంట్ థాట్స్‌తో తనదైన ముద్ర వేసుకున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇటీవలి కాలంలో ప్రధాన పాత్రలో సినిమాలు చేయడం తగ్గించి గెస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.
Upendra | సినిమాల్లో యూనిక్ కాన్సెప్ట్‌లు, డిఫరెంట్ థాట్స్‌తో తనదైన ముద్ర వేసుకున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇటీవలి కాలంలో ప్రధాన పాత్రలో సినిమాలు చేయడం తగ్గించి గెస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ‘ఓమ్’, ‘ఏ’, ‘రా’, ‘హెచ్ 2ఓ’, ‘యూ ఐ’ వంటి విభిన్న సినిమాలతో హీరోగా, దర్శకుడిగా తన క్రియేటివిటీని నిరూపించుకున్న ఉపేంద్ర 56 ఏళ్ల వయసులోనూ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఉపేంద్ర కుటుంబం వరలక్ష్మీ వ్రతం వేడుకని గ్రాండ్‌గా నిర్వహించింది. ఆయన భార్య ప్రియాంక త్రివేది తన సోషల్ మీడియా ఖాతాలో పండుగ సందర్భంగా కుటుంబ ఫోటోలు పంచుకోవడంతో, అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్న ఉపేంద్ర దంపతులను చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఉపేంద్ర భార్య ప్రియాంక త్రివేది .. ఓ బెంగాలీ నటి. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెద్దల ఆశీర్వాదంతో 2003లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రియాంక తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ మంచి గుర్తింపు పొందారు. జేడీ చక్రవర్తితో నటించిన ‘సూరి’ సినిమా, ఉపేంద్ర హీరోగా నటించిన ‘రా’, ‘హెచ్ 2ఓ’ వంటి చిత్రాల్లో ఆమె నటన మెప్పించింది.
ఇప్పటివరకు సుమారు 50కు పైగా సినిమాల్లో నటించిన ప్రియాంక, ఇటీవలే ‘ఉగ్రావతారం’ అనే చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక, కుటుంబం, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను తరచూ పంచుకుంటూ ఉంటారు. ఇక ఉపేంద్ర విషయానికి వస్తే ఆయన కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తనదైన ముద్ర వేసుకున్నాడు. సమాజాన్ని ప్రతిబింబించే డీప్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తీసిన ఉపేంద్రకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఉపేంద్ర, ‘కూలీ’ వంటి చిత్రాల్లో స్పెషల్ క్యామియోలతో అలరించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

