‘అమిగోస్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది కన్నడ భామ ఆషికా రంగనాథ్. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలకానుంది. అషికా రంగనాథ్ మాట్లాడుతూ ‘కథ వినగానే బాగా నచ్చింది. హీరో మూడు పాత్రల్లో కనిపించడం చాలా కొత్తగా అనిపించింది.
ఇప్పటికే నేను కన్నడంలో 12 సినిమాలు చేశాను. ‘అమిగోస్’ లో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తెలుగు పాటలు వినడం, సినిమాలు చూడటం అలవాటు ఉండటంతో భాష విషయంలో ఏమంత సమస్య ఎదురుకాలేదు. ప్రస్తుతం తెలుగు బాగా మాట్లాడుతున్నా. పెద్ద బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాతో తెలుగు ఎంట్రీ విషయంలో నా కల నిజమైంది’ అని చెప్పింది.