Suriya: ఐఎఫ్ఎఫ్ఎమ్ అవార్డ్‌తో సూర్య.. ఆనందం వ్యక్తం చేసిన జ్యోతిక

తమిళంలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న నటుడు సూర్య. గత ఏడాది సూరరై పోట్రు( తెలుగులో ఆకాశం నీ హద్దురా) అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక ఎందరో ప్రశంసలు పొందింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా కెప్టెన్ గోపినాథ్ జీవిత కథతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
సూర్య, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రలలో సుధా కొంగర చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించింది. సిఖ్య ఎంటర్టైన్మెంట్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటీటీలో విడుదలై భారీ హిట్ అందుకున్న మొదటి సినిమాగా ఇది నిలవగా, ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM ) 2021 లో రెండు క్యాటగిరీల్లో విజేతగా నిలిచింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021 లో ఉత్తమ నటనకు గాను హీరో సూర్య గెలుపొందాడు. అలాగే ఉత్తమ చిత్రంగానూ ఈ సినిమా నిలిచింది.
తాజాగా ఈ అవార్డ్లు సూర్య ఇంటికి చేరాయి. ప్రత్యేకమైన బాక్స్‌లో అవార్డులు రాగా, వాటిని ఓపెన్ చేసి చూసి సంతోషించాడు సూర్య. పక్కనే ఉన్న తన భార్య జ్యోతిక క్లాప్స్ కొడుతూ సూర్య సాధించిన ఈ ఘనతపై ప్రశంసలు కురిపిస్తుంది. ఈ సినిమాలో పరేష్ రావల్, ఊర్వశి, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించారు.
ఐఎఫ్ఎఫ్ఎమ్- 2021 అవార్డుల జాబితా చూస్తే :
ఉత్తమ నటుడు: సూర్య (ఆకాశం నీ హద్దురా)
ఉత్తమ నటి: విద్యా బాలన్ (షేర్నీ)
ఉత్తమ వెబ్ సిరీస్ నటుడు: మనోజ్ బాజ్‌పాయ్ ( ది ఫ్యామిలీమ్యాన్ 2)
ఉత్తమ వెబ్ సిరీస్ నటి: సమంత(‘ది ఫ్యామిలీమ్యాన్ 2’)
ఉత్తమ చిత్రం: ‘సూరరై పొట్రు’(ఆకాశం నీ హద్దురా)
ఉత్తమ డైరెక్టర్: అనురాగ్ బసు(లూడో)
ఉత్తమ వెబ్ సిరీస్: మీర్జాపూర్ 2
ఇక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు :‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’
డైవర్సిటీ ఆఫ్ సినిమా అవార్డు : పంకాజ్త్రిపాటి
ఉత్తమ డాక్యుమెంటరీ: షటప్ సోనా
Unboxing of the best film award for #SooraraiPottru from @IFFMelb
— BA Raju's Team (@baraju_SuperHit) September 5, 2021
Thank you all for owning #SooraraiPottru@Suriya_offl #SudhaKongara @rajsekarpandian @gvprakash @nikethbommi @Aparnabala2 @editorsuriya @jacki_art @YugabhaarathiYb @SonyMusicSouth @PrimeVideoIN @johnsoncinepro pic.twitter.com/VtUQ5BAvb6
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

