Ugram Movie Scenes | ‘నాంది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అదే కాంబోలో తెరకెక్కిన మూవీ ‘ఉగ్రం’. భారీ అంచనాల నడుమ వారం క్రితం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా భారీ రేంజ్లో ఏం రావడం లేదు. కాకపోతే ఆ రోజు రిలీజైన రామబాణం కంటే కాస్త బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. అయితే నరేష్ నటన మాత్రం వేరే లెవల్ అంటూ సినిమా చూసిన వారు ఆకాశానికి ఎత్తేశారు. యాక్షన్ సీన్స్‌లో ఒక స్టార్ నటుడిగా పర్ఫార్మెన్స్ చేశాడని తెలిపారు. ఇక దర్శకుడిగా విజయ్ ఈ సారి బోటా బోటీ మార్కులతోనే సరిపెట్టుకున్నాడు. కథ బాగానే ఉన్నా.. కథనాన్ని ఆసక్తికరంగా మల్చలేకపోయాడు.
ఇక సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయడానికి చిత్రబృందం సినిమాలో పలు కీలక సన్నివేశాలను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాలోని కీలకమైన హాస్టల్ ఫైట్ సీన్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గంజాయి తాగుతూ అమ్మాయిల్ని టీజ్ చేసే నలుగురు రౌడీలను చితకబాదే సీన్‌ను రిలీజ్ చేశారు. ఈ సీన్ మొత్తం నరేష్ యాక్టింగ్ వేరే లెవల్లో ఉంటుంది. ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిపోయాడు. అసలు మనం చూస్తుంది అల్లరి నరేష్నేనా అనేంతలా తన యాక్టింగ్‌తో కుమ్మేశాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా మిర్నా నటించింది.