Nbk107 Title | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌ను తన నెక్ట్స్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు రెడ్డిగారు, జై బాలయ్య అనే టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో రెండు గెటప్‌లలో కనిపించబోతున్నట్లు టాక్. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈయన షూటింగ్లో పాల్గొన్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.