రౌడీ జనార్ధనకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్
రెండు సినిమాల్లో సమాంతరంగా నటిస్తూ బిజీగా బిజీగా ఉన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలూ విడుదలయ్యే అవకాశం ఉంది.
రెండు సినిమాల్లో సమాంతరంగా నటిస్తూ బిజీగా బిజీగా ఉన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలూ విడుదలయ్యే అవకాశం ఉంది. వాటిలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ‘రణబాలి’ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుంటే, మరో సినిమా ‘రౌడీ జనార్ధన’ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఆ చిత్ర నిర్మాత దిల్రాజు.
ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉన్నది. దర్శకుడు రవికిరణ్ కోలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే.. క్రిస్టో జేవియర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’ఫేం విశాల్ మిశ్రా కూడా ఈ చిత్ర పాటల స్వరకల్పనలో భాగం అయ్యారు. ఇద్దరు ప్రతిభావంతులైన సంగీత దర్శకులు కలిసి ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. ఉత్కంఠభరితమైన గ్రామీణ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

