సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటి తునీషా శర్మ ఆత్మహత్య
Tunisha Sharma | భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం అలుముకున్నది. ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకున్నది. టీవీ సీరియల్ సెట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ
Tunisha Sharma | భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం అలుముకున్నది. ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకున్నది. టీవీ సీరియల్ సెట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనీషా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
యువ నటి ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం అలుముకున్నది. తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ప్రస్తుతం సోనీ సబ్ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సీరియల్లో షహజాది మరియమ్ పాత్రలో నటిస్తున్నది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలలో కూడా కనిపించింది. ఫితూర్, బార్ బార్ దేఖోలో, తనీషా కత్రినా కైఫ్.. టీనేజ్ పాత్రను పోషించింది. ‘ఇంటర్నెట్ వాలా లవ్’ సీరియల్లో తునీషా పాత్ర బాగా అందరినీ ఆకట్టుకున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

