Tuck Jagadish | పల్లెటూరి జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది

‘పల్లెటూరితో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని ప్రతి ఒక్కరికి జ్ఞప్తికి తెచ్చే చిత్రమిది. అన్నదమ్ముల సంఘర్షణ నేపథ్యంలో ఆద్యంతం ఉద్వేగభరితంగా ఉంటుంది’ అని అన్నారు శివనిర్వాణ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘టక్ జగదీష్’. నాని హీరోగా నటించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో శివనిర్వాణ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
టైటిల్ చూసి వినోదభరిత చిత్రమని చాలా మంది అపోహపడుతున్నారు. కానీ కుటుంబ విలువలతో ముడిపడి సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. నేను పల్లెటూరి నుంచి వచ్చా. మాది చాలా పెద్ద ఉమ్మడికుటుంబం. ఆ అనుబంధాల్ని ప్రతిబింబిస్తూ నిజాయితీతో కూడిన మంచి సినిమా చేయాలనే కోరిక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పటి నుంచి ఉండేది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా కొత్త పాయింట్‌తో సినిమా చేయాలనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది.
కమర్షియల్ లెక్కలు వేసుకోలేదు
కుటుంబం క్షేమం కోసం అనుక్షణం తపన పడే యువకుడిగా నాని కనిపిస్తారు. ఇతరులు తన కుటుంబాన్ని కించపరిస్తే సహించని అతడు తన ఫ్యామిలీలోనే వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం నాని పాత్ర మూడు భిన్న పార్శాల్లో సాగుతుంది. డ్యూయెట్స్, ఐటెంసాంగ్స్ లాంటి కమర్షియల్ హంగులన్నీ ఉండాలనే లెక్కలు వేసుకొని ఈ సినిమా చేయలేదు. నిజాయితీగా కథను నమ్మి చేశాం.
విజయ్‌దేవరకొండతో..
సినిమాలో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే సన్నివేశాలు చాలా ఉంటాయి. థియేటర్స్‌లో వాటిని మిస్సయిపోతున్నామనే వెలితి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా మైనస్లకంటే ప్లస్లపైనే దృష్టిపెట్టాం. ఓటీటీలో విడుదల చేయడం వల్ల కుటుంబమంతా కలిసి చూసే అవకాశం దొరుకుతుంది. గత చిత్రాలకు భిన్నంగా వినోదాత్మక కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా. విజయ్‌దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ‘లైగర్’ పూర్తికాగానే సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తాం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

