Tu Jhooti Main Makkaar Movie On Ott | బాలీవుడ్ మోస్ట్ హాండ్సమ్ హీరోలలో రణ్‌బీర్ ఒకడు. ‘బ్రహ్మస్త్ర’ వరకు ఆయన నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ కాకపోయినా.. హిందీ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక బ్రహ్మస్త్ర సినిమాతో తిరుగులేని హిట్‌ను సాధించి, ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదలైన నెలల గ్యాప్‌లోనే ‘తూ ఝూతీ మైన్ మక్కర్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు నెలల క్రితం హిందీలో రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
రోమ్-కామ్ సినిమాలకు పెట్టిన పేరైన లవ్ రంజన్ ఈసినిమాకు దర్శకత్వం వహించాడు. బోల్డ్ డైలాగ్స్, శ్రద్ధా అందాల ఆరబోతకు యూత్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అయ్యారు. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ సినిమా మంగళవారం అర్థ రాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం రణ్‌బీర్ యానిమల్ సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఎక్కడలేని హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.