థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా..
ఉద్వేగాల్ని మనసులోనే దాచుకుని గుంభనంగా ఉండటం కొందరికి చేతకాదు. త్రిప్తి డిమ్రి ఆ తరహా వ్యక్తే. ‘ఆనందమైనా, బాధైనా భావోద్వేగం ఏదైనా అస్సలు దాచుకోలేను’ అంటున్నది ఈ అందాలభామ.
ఉద్వేగాల్ని మనసులోనే దాచుకుని గుంభనంగా ఉండటం కొందరికి చేతకాదు. త్రిప్తి డిమ్రి ఆ తరహా వ్యక్తే. ‘ఆనందమైనా, బాధైనా భావోద్వేగం ఏదైనా అస్సలు దాచుకోలేను’ అంటున్నది ఈ అందాలభామ. ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ జీవితం ఆధారంగా రూపొంది, ఇటీవలే ఓటీటీలో విడుదలైన సినిమా ‘అమర్‌సింగ్ చంకీల’. బాలీవుడ్ తారలకోసం ముంబాయిలోని ఓ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన తారలలో త్రిప్తి డిమ్రీ కూడా ఉంది.
ఈ సినిమా చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది త్రిప్తి. ‘చాలాకాలం తర్వాత నేను చూసిన ఉత్తమ సినిమా ఇది. దర్శకుడు ఇంతియాజ్ అలీని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అమర్‌సింగ్‌గా దిల్జిత్ దొసాంజ్ జీవించాడు. అమర్జ్యోతిగా పరిణీతి అద్భుతం అనిపించారు. ఓ నిజాయితీగల కళాకారుడి అందమైన, హృదయ విదారకమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రేక్షకుల్ని సినిమాలో మమేకమయ్యేలా చేసిన దర్శకుడికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది త్రిప్తి డిమ్రీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

