వడ్డే నవీన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 19న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘నాన్న పోయాక, నేను నటిస్తూ, నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. ఇన్నాళ్లూ నా దగ్గరకు వచ్చిన కథలు నాకు నచ్చలేదు. నచ్చే కథలు నా దగ్గరకు రాలేదు. అందుకే గ్యాప్ వచ్చింది. దర్శకుడు కమల్ తేజ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్‌ని, పాత్ర క్యారెక్టరైజేషన్‌ని మాత్రమే చెప్పాడు. కథైతే ప్రాపర్‌గా లేదు.
అందుకే ఏడాది పాటు కథపై ఇద్దరం వర్క్ చేశాం. కొత్త కంటెంట్‌తో హై క్వాలిటీ స్టాండర్డ్‌లో సినిమా ఉంటుంది. తప్పకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’ అన్నారు వడ్డే ననీన్. తన డెబ్యూ మూవీ ఇంత గొప్పగా విడుదలవుతుందని ఊహించలేదంటూ దర్శకుడు కమల్ తేజ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా కథానాయిక రాశీసింగ్, నటులు వడ్లమాని శ్రీనివాస్, సాయికిరణ్, సాత్విక్, ఫైట్ మాస్టర్ రామ్ సుంకర, సంగీత దర్శకుడు కల్యాణ్ నాయక్, ఎడిటర్ విజయ్ మక్తవరపు, డీవోపీ కార్తీక్ సాయికుమార్, ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి తదితరులు మాట్లాడారు.