Tabaahi Video Song | రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’ (Toxic) సినిమా నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘తబాహి’ (Tabaahi) వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో యాష్, కియారా అద్వానీల మధ్య ఉన్న హాట్ కెమిస్ట్రీ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ వీరిద్దరి లవ్ అండ్ ఇంటెన్సిటీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. పాట యావరేజ్‌గా ఉన్నప్పటికీ, విజువల్స్ మాత్రం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా తదితరులు సంగీతం అందిస్తుండగా, ఈ తెలుగు వర్షన్ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యాష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2026 ఆగష్టు 26న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.