Toxic Movie | గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా మిశ్రమ స్పందనల మధ్యే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన 7 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 313.55 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
భారత్‌లో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 229.95 కోట్లు, గ్రాస్ రూ. 272.80 కోట్లకు చేరగా, ఓవర్సీస్ గ్రాస్ రూ. 40.75 కోట్లుగా నమోదైంది. ఒకవైపు ఈ సినిమాకు నెగిటివ్ వచ్చిన కూడా సినిమా కలెక్షన్లలో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఇక ఆగస్ట్ 26న విడుదలైన ఈ చిత్రంలో కైరా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నెగెటివ్ టాక్‌ను తట్టుకుంటూ వీక్డేస్లోనూ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా త్వరలోనే రూ. 320 కోట్ల మైలురాయిని అందుకోనుంది.