Tourist Family | 5 కోట్ల బడ్జెట్.. 55 కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ హవా
Tourist Family Movie | ఈ మధ్య తమిళంలో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే తమ హావా చూపిస్తున్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన లబ్బర్ పందు, మెయ్యాళగన్, కుడుండస్తాన్, డ్రాగన్ చిత్రాలు సూపర్ హిట్లు అందుకున్నాయి.
Tourist Family Movie | ఈ మధ్య తమిళంలో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే తమ హావా చూపిస్తున్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన లబ్బర్ పందు, మెయ్యాళగన్, కుడుంబస్తాన్, డ్రాగన్ చిత్రాలు సూపర్ హిట్లు అందుకున్నాయి. అయితే ఇదే కోవలో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ. తమిళ నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్ కూడా ఈ సినిమా చూసి చిత్రబృందంని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు.
ఇదిలావుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(refugee)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

