ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాప్‌గేర్’. కె.శశికాంత్ దర్శకుడు. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘వెన్నెల వెన్నెల’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. గాయకుడు సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి యువతకు కనెక్ట్ అయ్యే అంశాలు వున్నాయి. ఆది కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిది’ అన్నారు. డిసెంబరు 30న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్.