‘కేజీఎఫ్’ లాంటి సినిమా చేస్తాను
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న సినిమా ‘టాప్ గేర్'. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు కె. శశికాంత్ రూపొందించారు.
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న సినిమా ‘టాప్ గేర్’. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు కె. శశికాంత్ రూపొందించారు. ఈ నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ…‘ఈ చిత్ర కథ నన్ను బాగా ఆకట్టుకుంది. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించాను. ఒక రోజులో సాగే కథ ఇది. ఓ మధ్యతరగతి కుర్రాడు తనకు సంబంధం లేని సమస్యలో ఇరుకుని దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. పేరుకు తగినట్లే సినిమా కథనం టాప్ గేర్ లో వెళ్తుంది. సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఆకర్షణ అవుతుంది. ‘కేజీఎఫ్’ వచ్చాక మాస్ సినిమాలంటే అర్థం మారిపోయింది. ప్రేక్షకులు ఆ తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడుతున్నారు. చేస్తే అలాంటి సినిమాలు చేయాలి. ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటించను. కొత్త కథలు ఎంచుకోవాలని, ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం లక్కీ మీడియా సంస్థలో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

