KGF Chapter-2 | ‘కేజీఎఫ్-2’ నుంచి బిగ్ అప్డేట్.. ‘తుఫాన్’ వీడియో సాంగ్ వచ్చేది అప్పుడేనట!
Toofan Video Song | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం 1200కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చిత్రం విడుదలై నెల రోజులు దాటిన కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. ఈ సినిమా విజయంలో రవిబస్రూర్ ముఖ్య పాత్ర వహించాడు అనడంలో సందేహమే లేదు. ఈ చిత్రంలో పాటులు గాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి.
కేజీఎఫ్ చిత్ర బృందం గత రెండు వారాల నుంచి ప్రతి వారం ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేస్తుంది. అదే విధంగా ఈ వారం కూడా మేకర్స్ మరో వీడియో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థియేటర్లో రచ్చ లేపిన ‘తుఫాన్’ వీడియో సాంగ్‌ను బుధవారం ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ‘ఎదగరా’, ‘మెహబూబా’ వీడియో పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
#Toofan full video song from 11AM tomorrow 🔥#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @bhuvangowda84 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd @KGFTheFilm pic.twitter.com/glAqyi237t
— Hombale Films (@hombalefilms) May 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- sreenidhishetty
- Tollywood
- Yash
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

