Tollywood | ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు.. సీఎం రేవంత్‌ను కలిసే యోచనలో టాలీవుడ్ ప్రముఖులు
పుష్పా-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేదిలేదని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అదేవిధంగా సినిమా రేట్ల పెంపుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్: పుష్పా-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేదిలేదని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అదేవిధంగా సినిమా రేట్ల పెంపుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. చారిత్రక, తెలంగాణ ఉద్యమం వంటి సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు (Tollywood) కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
రామ్‌చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలవడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశీ చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని వెల్లడించారు. సంధ్య థియేటర్ వద్ద అనుకోని ఘటన జరిగిందన్నారు. ఏ హీరో, నిర్మాత అలా జరగాలని కోరుకోరని చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందనేది అవాస్తవమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు అక్కడి ప్రభుత్వం సహకరిస్తున్నదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లు జరుగుతున్నాయని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

