టాలీవుడ్ నాకు రెండో ఇల్లు

వాణిజ్య ప్రధాన సినిమాలతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలకు ప్రాముఖ్యతనిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తానని అంటోంది ప్రియాప్రకాష్ వారియర్. ‘వింక్గర్ల్’ ఇమేజ్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్’. ఎస్.ఎస్.రాజు దర్శకుడు. మెగాసూపర్గుడ్ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రియా ప్రకాష్‌వారియర్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..
సాధారణంగా సినిమాను ఎంచుకునే విషయంలో తుది నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటా.‘ఇష్క్’ సినిమాను మాత్రం రెండు రోజుల్లోనే అంగీకరించా. మలయాళ మాతృక ఇదివరకే చూశా. చాలా నచ్చింది. అందుకే రీమేక్‌లో నటించే అవకాశం రాగానే ఆనందంగా ఒప్పుకొన్నా. మాతృక ప్రభావం కనిపించకుండా దర్శకుడి సూచనలకు అనుగుణంగా నా శైలిలో పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించా. ఇందులో అను అనే అమ్మాయిగా నా క్యారెక్టర్ నవ్యరీతిలో ఉంటుంది. రెగ్యులర్ లవ్స్టోరీస్కి భిన్నంగా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ఒక రోజు రాత్రిలో ఓ యువజంటకు ఎదురైన పరిణామాలేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. నిత్యజీవితంలో యువత ఎదుర్కొంటున్న సంఘటనల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం.
అసలైన అరంగేట్రం
మలయాళంలో ఎక్కువగా కంటెంట్ ప్రధాన సినిమాలు తెరకెక్కుతుంటాయి. తెలుగు ప్రేక్షకులు పాటలు, ఫైట్స్ లాంటి కమర్షియల్ హంగుల్ని ఇష్టపడుతుంటారు. అదే సినిమాల పరంగా తెలుగు, మలయాళ భాషల్లో నేను గమనించిన మార్పు. నా వరకైతే కథాబలమున్న ప్రయోగాత్మక పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నా. తొలి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు నాపై అమితమైన ప్రేమను చూపుతున్నారు. టాలీవుడ్ నాకు రెండో ఇల్లుగా మారిపోయింది. తెలుగులో ఇదే నా అసలైన అరంగేట్రంగా భావిస్తున్నా. ఇదివరకు ‘చెక్’లో నా పాత్ర ఇరవై నిమిషాల నిడివితో మాత్రమే ఉంటుంది. ఇందులో పూర్తి నిడివి కలిగిన పాత్రను పోషించా.
సందీప్‌కిషన్ సినిమాలో
‘వింక్ గర్ల్’ ఇమేజ్ కారణంగా తొలి సినిమా విడుదల తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలొచ్చాయి. చదువు కోసం పలు పెద్ద సినిమాల్ని వదులుకున్నా. గత ఏడాది బీకామ్ డిగ్రీ పూర్తిచేశా. సినిమాలపై దృష్టిపెట్టే తరుణంలో కరోనా వల్ల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఆ సమయంలో నా కెరీర్ ముగిసిపోతుందని భయపడ్డా. నెగెటివ్ ఆలోచనలతో ఇబ్బందిపడ్డా. నాతో పాటు అందరి జీవితాలు ఆగిపోయాయనే వాస్తవాన్ని అర్థం చేసుకున్నా. సానుకూల దృక్పథంతో మంచిరోజుల కోసం ఎదురుచూశా. ప్రస్తుతం తెలుగులో సందీప్‌కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నా. మలయాళంలో నటనకు ప్రాధాన్యమున్న మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

