Ram Pothineni | తన సినిమా హక్కులను తానే కొనుక్కున్న యువ స్టార్ హీరో?
The warriorr Theatrical Rights | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ కథలను ఓకే చేస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది వారియర్’. తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ఇస్తుంది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది.
ఇటీవలే రామ్ ‘ది వారియర్’ చిత్రాన్ని వీక్షించాడట. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా రావడంతో ఎంతో ఎగ్సైట్మెంట్కు గురైయ్యాడట. దీంతో వైజాగ్ ఏరియా థియేట్రికల్ హక్కులను రామ్ కొనుగోలు చేశాడని టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘బుల్లెట్’ సాంగ్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 11కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

