NTR | జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గురించి చెప్పాలి అంటే.. టెంపర్ సినిమాకు ముందు తర్వాత అని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాకు ముందు ఎన్టీఆర్ కెరీర్ అంతా ఒడిదుడుకుల ప్రయాణంగానే సాగింది. ఒక హిట్టు వస్తే మూడు నాలుగు సంవత్సరాల పాటు ఫ్లాపులు అన్నట్టు ఉండేది పరిస్థితి. కానీ టెంపర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్లుగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు తారక్. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది. దీని అన్నిటికి కారణం సినిమా సినిమాకు ఆయన అవుతున్న మేకోవర్ చూసి అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే సినిమా కోసం ఆయన కష్టపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారిపోతూ అందరిని అలరిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ నుంచి ఇదే జరుగుతుంది. ఆ సినిమాకు ముందు ఎన్టీఆర్ కెరీర్ పెద్దగా ఊపు లేదు. కానీ ఏ ముహూర్తంలో పూరి జగన్నాథ్ తో టెంపర్ సినిమా చేశాడో తెలియదు కానీ.. అప్పటినుంచి ఎన్టీఆర్ పట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుంది.
టెంపర్ కోసం ఫస్ట్ టైం 6 ప్యాక్ చేశాడు జూనియర్. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు. ఇక వెంటనే జనతా గ్యారేజ్ కోసం కాస్త బరువు పెరిగి చబ్బీ చబ్బిగా ఉన్నాడు. జై లవకుశలో మూడు క్యారెక్టర్ల కోసం మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత అరవింద సమేత కోసం పూర్తిగా సన్నగా కరెంటు తీగల మారిపోయాడు.
ఇక ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కనిపించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొమరం భీమ్ క్యారెక్టర్ కోసం తారక్ పూర్తిగా మారిపోయాడు. ఇక ఇప్పుడు దేవర కోసం మరోసారి లుక్ మార్చుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా బెంగళూరులో జరిగిన పార్టీలో ప్రశాంత్ నీల్, మైత్రి రవిశంకర్ తో కలిసి కనిపించాడు జూనియర్. అక్కడ ఆయన కొత్త లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేవర కోసమే ఇలా మారిపోయాడా లేదంటే వార్ 2 సినిమా కోసం ఈ లుక్ ట్రై చేస్తున్నాడా అనేది సస్పెన్స్. ప్రస్తుతం దేవర షూటింగ్ వేగంగా జరుగుతుంది. మే లోపు ఈ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే వార్ 2 కోసం కూడా డేట్స్ ఇచ్చాడు ఈయన. ఇప్పటికే హృతిక్ రోషన్ ఆ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. జూనియర్ వస్తే ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ తెరకెక్కించాలని దర్శకుడు అయన్ ముఖర్జీ వెయిట్ చేస్తున్నాడు. ఏదేమైనా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు సడన్ షాక్ ఇస్తూనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.