Venkatesh Maha | వెంకటేష్ మాహా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్ట్‌లు, న్యూస్ వెబ్సైట్లలో బోలెడన్ని వార్తలు.. ఇలా ఒక్క రోజులోనే వెంకటేష్ మాహా సంచలనం అయ్యాడు. సంచలనం అయ్యాడంటే ఏదో గొప్ప పని చేసి ఉంటాడని అనుకునేరు.. కేజీఎఫ్ వంటి వెయ్యి కోట్ల బొమ్మ గురించి, సినిమాలోని యష్ క్యారెక్టరైజేషన్ గురించి నీచాతి నీచంగా మాట్లాడి ట్రెండ్ అయ్యాడు. ఇటీవలే ఓ ఇంటర్వూలో వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కన్నడిగులు వెంకటేష్ మాహాను తెగ ట్రోల్ చేస్తున్నారు. దమ్ముంటే కేజీఎఫ్ లాంటి సినిమా తీసి నిరూపించూ అంటూ కోపంతో ఊగిపోతున్నారు. కాగా తాజాగా ఈ కాంట్రవర్సీపై వెంకటేష్ మాహా స్పందించాడు.
భాష తప్పుగా ఉండొచ్చు కానీ, ఆ సినిమాకు చేసిన స్టేట్మెంట్ అయితే వెనక్కి తీసుకోవడం లేదని వెంకటేష్ మహా అన్నాడు. ఒక బాధ్యత గల దర్శకునిగా ఉండి ఆ తీరులో మాట్లాడి ఉండాల్సింది కాదు అని అందుకు క్షమాపణలు కోరుకుంటున్నానని తెలిపాడు. `కేజీఎఫ్` సినిమా కూడా చాలా మందికి నచ్చలేదు, వారంతా నాలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు, నేను మాట్లాడింది కరెక్టే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే తాను సినిమాలోని కల్పిత పాత్రని విమర్శించాను తప్ప రియల్ లైఫ్‌లో ఏ వ్యక్తిని, ఏ క్రియేటివ్ పర్సన్‌ని విమర్శించలేదు, తక్కువ చేయలేదు. కాకపోతే తాను వాడిన భాష తప్పు, మాట్లాడిన పదాలు సరిగా లేవు ఆ విషయంలో నేను క్షమాపణనలు తెలియజేస్తున్నానని వీడియో రూపంలో వెల్లడించాడు.
అంతేకాకుండా నా సినిమాలు నచ్చిన వారు, నా ఒపీనియన్ నచ్చిన వాళ్లు సందేశాలు పంపారు. వాళ్లందరి తరఫున నా వాయిస్ అది. ఒక ఎమోషన్లో ఒక కల్పిత పాత్రని దూషించాను. దానికి రియల్ పర్సన్ అయినటువంటి నన్ను ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు. తప్పుడు ఇమేజ్‌ని క్రియేట్ చేస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇది కొత్త కాదు, చాలా సార్లు చూశాను. ఇలాంటి ఎన్నో సంఘటనల కారణంగా నాకు అలాంటి అభిప్రాయం ఏర్పడింది. అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నాను అంటూ వీడియో ద్వారా వెల్లడించాడు.
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023