Satyadev Krishnamma Movie | సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల
Krishnamma Movie First Single | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కృష్ణమ్మ’ ఒకటి. ఇటీవలే ‘గాడ్సే’తో ప్రేక్షకులను నిరాశపరిచిన సత్యదేవ్ ఈ సారి కృష్ణమ్మతో ఎలాగైనా భారీ విజయం సాధించాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే మొదటి సారి పూర్తి స్థాయి యాక్షన్ కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
‘ఏమవుతుందో మనలో’ అంటూ సాగే మెలోడియస్ గీతాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. కాలభైరవ మరోసారి తన మ్యూజిక్‌తో శ్రోతలను ఫిదా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

