Regina Cassandra | ఖాళీ టైమ్ దొరికితే అదే చేస్తా.. సీక్రెట్స్ బయటపెట్టిన రెజీనా
Regina Cassandra | రెజీనా కసాండ్రా.. పదహారేండ్ల వయసులోనే ఇండస్ట్రీ బాటపట్టింది. అవకాశాలను ఒడిసిపట్టుకుంది. హీరోయిన్గా పరిచయమైనా.. ధైర్యం చేసి నెగెటివ్ పాత్రలో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో తెలుగులో కనిపించడం లేదు కానీ.. తమిళ, హిందీ పరిశ్రమల్లో జోరు మీదుంది. తాజాగా ‘ఫర్జీ’ సిరీస్‌తో పలకరించింది.
Regina Cassandra | రెజీనా కసాండ్రా.. పదహారేండ్ల వయసులోనే ఇండస్ట్రీ బాటపట్టింది. అవకాశాలను ఒడిసిపట్టుకుంది. హీరోయిన్గా పరిచయమైనా.. ధైర్యం చేసి నెగెటివ్ పాత్రలో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో తెలుగులో కనిపించడం లేదు కానీ.. తమిళ, హిందీ పరిశ్రమల్లో జోరు మీదుంది. తాజాగా ‘ఫర్జీ’ సిరీస్‌తో పలకరించింది. జీ ఫైవ్ ‘జాన్బాజ్ హిందుస్థాన్ కే’ అనే వెబ్ సిరీస్‌లో పోలీస్ పాత్రలో జీవించింది. ఆ అందాలతార ముచ్చట్లు మీకోసం..
ఇప్పటివరకూ నా జీవితంలో వచ్చిన ప్రతి మలుపూ సంతోషకరమే. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే ఏదో ఒకటి సాధిస్తామని నమ్ముతాన్నేను. ఆ సూత్రాన్నే ఫాలో అయ్యాను. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అభిమానులు సెల్ఫీ అడుగుతుంటారు. అదంతా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాతో సెల్ఫీ దిగేంత గొప్ప పని ఏం చేశానబ్బా? అని ప్రశ్నించుకుంటాను. ఆ ప్రేమను, అభిమానాన్ని చిన్నచూపు చూడకూడదు.
మంచీచెడులు తెలియని వయసులో నా సినిమా కెరీర్ ఆరంభమైంది. పదహారేండ్ల వయసులో యాంకర్‌గా మొదలైన ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతున్నది. మా కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. ఇన్నేళ్ల నట జీవితంలో చాలా నేర్చుకున్నాను. గుర్తింపు వచ్చిన తర్వాత ప్రతి మనిషికీ బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి అనుభవాన్నీ ఆహ్వానించాలి.. అనుభూతి చెందాలి. అప్పుడే సెలెబ్రిటీ హోదా సార్థకం అవుతుంది.
ఈ మధ్య జీ5లో ‘జాన్బాజ్ హిందుస్థాన్ కే’ అనే సిరీస్‌లో నటించాను. అందులో కావ్య అయ్యర్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర నాది. రియల్ లైఫ్‌లో ఆమె చాలా గ్రేట్. అమ్మగా, కూతురుగా, భార్యగా, ఆఫీసర్‌గా ఎక్కడా తొణుకు లేకుండా తన పాత్రను పోషించిన ధీరవనిత. అలాంటి స్ఫూర్తిదాయక మహిళల కథలు మరిన్ని వెలుగులోకి రావాలి. ఈ వెబ్ సిరీస్ కోసం కిరణ్‌బేడి మేడమ్తోపాటు ఢిల్లీ డీసీపీని కలిశాను. కిరణ్‌బేడీ మేడమ్ ఎంతోమంది ఆడపిల్లలకు రోల్ మాడల్. ఉన్నామా.. అంటే ఉన్నాం అన్నట్టు కాదు. మన చుట్టూ ఉన్నవాళ్లను ప్రభావితం చేయగలగాలి.
ఆచార్య సినిమాలో చిరంజీవి గారితో కలిసి ఓ పాటలో నటించే ఛాన్స్ రావడం గొప్ప అనుభూతి. ఆయన డ్యాన్స్ స్పీడ్‌కు, బాడీలో గ్రేస్‌కు.. హ్యాట్సాఫ్. చూపు తిప్పుకోలేకపోయాను. భరతనాట్యం నేర్చుకున్నా, ఆయనతో డ్యాన్స్ అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే.
ఖాళీ సమయం దొరికితే రొమాంటిక్ నవలలు చదువుతా. ఇంకా నా రెండు పిల్లులతో ఆడుకుంటా. ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్, స్కై డైవింగ్ అంటే చాలా ఇష్టం. ఏఆర్ రెహమాన్ పాటలు వింటా. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తా.
ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులున్నా ఒక్క కాఫీతో మళ్లీ కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. నా ఫేవరెట్ డ్రింక్ కాఫీనే. నేను ఎవరినైనా కలిసినా నన్ను కలిసేందుకు ఎవరైనా వచ్చినా.. ముందు అందుకునేది, అందించేది కాఫీ కప్పే. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు బాగా తినేదాన్ని. పెటాలో చేరిన తర్వాత నాన్‌వెజ్ మానేశా. ఇప్పుడు పూర్తి శాకాహారిగా మారిపోయా.
నా ఫ్రెండ్స్ నన్ను ‘మదర్ ఆఫ్ గ్యాంగ్’ అని పిలుస్తుంటారు. నా అనుకునే వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలనుకునే మనస్తత్వం నాది. నేను సైకాలజీలో డిగ్రీ చదివాను. అందుకేనేమో.. మనుషులతో ఓ పట్టాన కనెక్ట్ కాలేను. ఒకరి మీద ఆధారపడటం, ఒకరికి ఆధారంగా నిలబడటం నాకెందుకో నచ్చదు. ప్రతి మనిషికీ ఒక అస్తిత్వం, వ్యక్తిత్వం ఉండాలి. జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తే.. ముందుకు సాగడం లేదు అనిపిస్తే.. అడుగులు పెద్దగా వేయాలి. అంతేకానీ, అక్కడే ఆగిపోకూడదు.
Read More :
“Regina Cassandra | సరికొత్త పోజులతో కవ్విస్తున్న రెజీనా కసాండ్రా..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

