Malavika Sharma | లాయర్‌గా రిటైర్గా అవుతా.. సినిమా ఆఫర్లు తగ్గాక కెరీర్ ప్లాన్స్ ఏంటో చెప్పేసిన మాళవిక
Malavika Sharma | ‘నేల టికెట్టు’ తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ.. మాళవికా శర్మ. మొదటి సినిమాతోనే మాస్ మహరాజ రవితేజతో ఆడిపాడి అందరినీ ఆకట్టుకుంది. ‘రెడ్'లో రామ్‌తో జతకట్టి.. ‘కాఫీ విత్ కాదల్' అంటూ కోలీవుడ్‌నూ పలకరించింది.
Malavika Sharma | ‘నేల టికెట్టు’ తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ.. మాళవికా శర్మ. మొదటి సినిమాతోనే మాస్ మహరాజ రవితేజతో ఆడిపాడి అందరినీ ఆకట్టుకుంది. ‘రెడ్’లో రామ్‌తో జతకట్టి.. ‘కాఫీ విత్ కాదల్’ అంటూ కోలీవుడ్‌నూ పలకరించింది. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అంటూ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నది మాళవిక. మంచినటిగా గుర్తింపు తెచ్చు కోవడమే లక్ష్యమంటూ ఈ లాయరమ్మ పంచుకున్న కబుర్లు..
నటన అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. అదే ఇటువైపు వచ్చేలా చేసింది. మోడల్‌గా నా కెరీర్ మొదలైంది. నటనలో శిక్షణ తీసుకున్నా. యాడ్స్‌లో కనిపించడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘నేల టికెట్టు’ సినిమా నాకెప్పుడూ ప్రత్యేకమే.
నేను తెలుగులో చేసిన సినిమాలు చూసి సుందర్ సర్ నాకు ‘కాఫీ విత్ కాదల్’లో అవకాశం ఇచ్చారు. కథ నచ్చడంతో ఓకే చెప్పేశా. దక్షిణాది ప్రేక్షకుల ఆదరణ మరిచిపోలేనిది. ప్రస్తుతం హిందీతోపాటు తమిళంలోనూ ఒక సినిమా చేస్తున్నా. తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. కథలు వింటున్నా.
నటిగా రాణిస్తూ లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం అసాధ్యం. అందుకే నా వృత్తిని పక్కనపెట్టి అభిరుచికి ప్రాధాన్యం ఇచ్చా. ఒకేసారి రెండిటికీ న్యాయం చేయలేం! నడి వయసు వచ్చాక మళ్లీ లాయర్‌గా కెరీర్ ప్రారంభిస్తా. న్యాయవాదిగానే పదవీ విరమణ చేయాలనుకుంటున్నా.
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ అంటే ప్రాణం. తమిళ పరిశ్రమలో విజయ్ అంటే అభిమానం. ఇటాలియన్ ఫుడ్ ఇష్టపడతా. ఖాళీ సమయాల్లో యూట్యూబ్‌లో నా ఇంటర్వ్యూలు చూస్తాను. గ్లాస్ పెయింటింగ్, స్కెచ్‌లు వేయగలను.
నావరకు నటన కంటే డబ్బింగే కష్టమైన పని. స్మార్ట్‌ఫోన్‌కు నేను బానిస కాలేదు. వీలైనంత తక్కువగా వాడతాను. అత్యవసరమైతే తప్ప కాల్స్ చేయను. సమస్య వచ్చినా, సంతోషంగా
అనిపించినా బెస్ట్‌ఫ్రెండ్ మన్నారా చోప్రాతో పంచుకుంటా. ‘వైఫల్యం అంటే ఓడిపోవడం కాదు. ప్రయత్నించడం ఆపేయడం’ అనే మాట నమ్ముతాను.
రొటీన్‌కు భిన్నంగా ఉండే పాత్రలు ఇష్టం. నటిగా రాణించాలంటే అన్నిరకాల పాత్రలూ చేయగలగాలి. ప్రేక్షకులకు చేరువయ్యే.. పక్కింటి అమ్మాయి పాత్రలు సహజంగా ఉంటాయి. ఏ
పనిచేసినా అందులో కొత్తదనాన్ని అన్వేషిస్తాను. ఏ పాత్ర చేసేందుకైనా నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నా. కథక్, పోల్ డ్యాన్స్, కిక్‌బాక్సింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ నేర్చుకుంటున్నా. తమిళం, తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా.
Read More :
Malavika Mohanan | పరువాలు ఒలకబోస్తున్న మాళవిక మోహనన్..”
Malavika Mohanan | కాటుక కనులతో సెగలు పుట్టిస్తున్న మాళవిక
“Malavika Mohanan | మెరిసే డ్రెస్‌లో మాళవిక మోహనన్ మెరుపులు..”
“Malavika Mohanan | చురకత్తులాంటి చూపులతో చంపేస్తున్న మాళవిక మోహనన్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

