Ileana D’Cruz | తల్లి కాబోతున్న ఇలియానా.. పెళ్లి కాకుండానే..!
Ileana D'Cruz | పదిహేడేళ్ల క్రితం వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమానే తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Ileana D’Cruz | పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమానే తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఇలియానా దూకుడు ఎక్కువ రోజులు ఇక్కడ సాగలేకపోయింది. ఒకానొక దశలో వరుస పరాజయాలు పలకరించాయి. గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే.. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో మకాం ముంబైకి షిఫ్ట్ చేసింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఒకటి, రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. దాంతో గత కొంత కాలంగా ఇలియానా కెరీర్ అడపా దడపాగా సాగుతుంది.
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ యూత్‌లో హీట్ పెంచుతూ ఉంటుంది. కాగా తాజాగా ఈ బ్యూటీ చేసిన పోస్ట్ సంచలనం రేపుతుంది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి దాంట్లో ‘అడ్వేంచర్ మొదలవబోతుంది’ అని రాసి ఉన్న టీ షర్టును పోస్ట్ చేసింది. రెండో దాంట్లో మామా(అమ్మ) అనే లాకేట్ ఉంది. ఇలా రెండు ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని క్లారిటీ ఇచ్చేసింది.
అయితే దీనిపై పలువురు పెళ్లి కాకుండానే తల్లి ఎలా అయ్యావు? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ బోలెడు ప్రశ్నలను నెటిజన్లు అడుగుతున్నారు. మరికొందరు మాత్రం అవి ఇలియానా పర్సనల్ విషయాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికి ఇలా ఇలాయానా ఒక్కసారిగా ప్రెగ్నెంట్ అంటూ చెప్పడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.
ఇక ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్ కొనసాగింది. కాగా కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతడితో బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కత్రినాకైఫ్ సోదరుడు స్టెబాస్టిన్తో రిలేషన్లో ఉన్నట్లు జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఎన్నో సార్లు ఈ జంట మీడియా కంట పడింది. మరీ ఆ బిడ్డ వీళ్లద్దరికి పుట్టబోయే బిడ్డేనా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమాల విషయనికొస్తే ప్రస్తుతం ఈ గోవా సోగసరి ‘అన్ఫేర్ అండ్ లవ్లీ’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

