Anjali | శ్రీలీలతో కంపేరిజన్.. సీరియస్ అయిన అంజలి!
Anjali | అంజలి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. పేరుకు తెలుగమ్మాయే అయినప్పటికీ తెలుగు కంటే తమిళ సినిమాలతోనే ఇక్కడి వారికి దగ్గరైంది. టాలీవుడ్‌లోనూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, వకీల్‌సాబ్ వంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది.
Anjali | అంజలి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. పేరుకు తెలుగమ్మాయే అయినప్పటికీ తెలుగు కంటే తమిళ సినిమాలతోనే ఇక్కడి వారికి దగ్గరైంది. టాలీవుడ్‌లోనూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, వకీల్‌సాబ్ వంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమె తర్వాత వచ్చిన ఎంతోమంది యంగ్ హీరోయిన్లు మాత్రం టాప్‌లో దూసుకెళ్లారు. అంజలి మాత్రమే అక్కడే ఉండిపోయింది. ఇదే విషయమై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అంజలికి కోపం తెప్పించింది.
అంజలి కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది. ఈ సందర్భంగా మీడియాతో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా యూనిట్ ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అంజలిని ఓ ప్రశ్న అడిగింది. తాను అంజలికి పెద్ద ఫ్యాన్ అని చెప్పిన సదరు రిపోర్టర్.. తెలుగమ్మాయి కావడం వల్లే సరైనా బ్రేక్ రాలేదని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. దానికి బదులిస్తూ.. నాకు బ్రేక్ రాకపోతే మీరు నాకు అభిమాని ఎలా అయ్యారని రివర్స్ కౌంటరిచ్చింది. తాను తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నానని తెలిపింది. అయితే దీనికి మళ్లీ సదరు రిపోర్టర్ స్పందిస్తూ.. శ్రీలీల రేంజ్లో సక్సెస్ కాలేదు కదా అంటూ పెళ్లిసందడి బ్యూటీతో పోల్చింది. తనను శ్రీలీలతో పోల్చడంతో అంజలికి చిర్రెత్తుకొచ్చింది. ఇప్పటికీ తాను సినిమాలతో బిజీగానే ఉన్నానని చెప్పింది. అయినా తానెప్పుడు నంబర్స్ గేమ్‌ను పట్టించుకోనని సమాధానమిచ్చింది. టాప్, సెకండ్ అనేవి మన దృష్టి కోణాన్ని బట్టే ఉంటాయని తెలిపింది. నాకు ఒక హీరోయిన్ నచ్చొచ్చు.. మీకు ఇంకొక హీరోయిన్ నచ్చొచ్చు.. ఈయనకు మరో హీరోయిన్ నచ్చొచ్చు. ఆ ముగ్గరూ ఒక్కరే అవ్వాలన్న రూల్ లేదు. అందుకే ఇది నంబర్ గేమ్ కాదని వివరించింది. తనకు నచ్చిన ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని.. అలా లేకపోతే ఆ కథలను ఎంచుకోనని కుండబద్దలు కొట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

