బాహుబలిలో భళ్లాల దేవుడిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో చాలా పాపులారిటీ తెచ్చుకున్నాడు టాలీవుడ్ (Tollywood) యాక్టర్ రానా (Rana). ఈ చిత్రంలో రానా యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. అయితే సోలో హీరోగా ప్రభాస్ కు వచ్చిన పాపులారిటీతో పోలిస్తే రానాకు అంత సక్సెస్ రావడం లేదు. చాలా కష్టపడి చేసిన అరణ్య (Aranya) చిత్రం పాన్ ఇండియా కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చినా..ఆశించిన స్థాయిలో బాక్సాపీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.
దీంతోపాటు 1945 సినిమా కూడా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే తన నెక్ట్స్ సినిమాకు
థియేటర్లలో వచ్చే స్పందనపై చాలా అనుమానాలు ఉన్నాయట. దీంతో సినిమాపై ఓ అంచనాకు వచ్చేందుకు ఇండస్ట్రీలోని స్నేహితులకు ప్రైవేట్ షోలు వేయాలని అనుకుంటున్నాడని, వారి ఫీడ్ బ్యాక్ తెలుసుకుని రానా ఓ నిర్ణయం తీసుకుంటాడని టాక్ నడుస్తోంది. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా రానా పోషించిన డానియల్ శేఖర్ పాత్రకు మంచి స్పందనే వచ్చింది.
అయితే ఇపుడు విరాటపర్వం (Virataparvam) సినిమా విడుదల విషయంలో కాన్ఫిడెంట్ తక్కువవడంతో స్పెషల్ స్క్రీనింగ్ తర్వాతే విడుదలపై రానా ఓ క్లారిటీకి రావాలనుకుంటున్నాడని తెలుస్తోంది. విరాటపర్వం సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా..? లేదంటే ఓటీటీలో విడుదల చేస్తారా..? అనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ నెలకొంది. మరి డైరెక్టర్ వేణు ఊడుగుల, రానా టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.