Gopichand | ‘ప్రభాస్ అడిగితే ఎలాంటి క్యారెక్టర్ అయిన చేస్తా’ :గోపిచంద్
Pakka Commercial Promotions | చాలా కాలం తర్వాత గోపిచంద్‌కు ‘సీటీమార్’ మంచి హిట్‌గా నిలిచింది. కంటెంట్‌తో పాటు మాస్ యాక్షన్ కథలను ఎంచుకుంటున్నా గోపిచంద్‌కు కావలిసినంత గుర్తింపు మాత్రం రావడంలేదు. యాక్టర్‌గా గ్రేట్ పర్ఫామెన్స్ ఇచ్చినా, కమర్షియల్ హీరోగా మాత్రం నిలబడలేకపొతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పక్కా కమర్షియల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. కాగా ప్రమోషన్లలో భాగంగా గోపిచంద్ సినిమాపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
ప్రమోషన్లో భాగంగా గోపిచంద్‌ను ప్రభాస్ సినిమాలో మిమ్మల్ని విలన్‌గా అడిగితే చేస్తారా అని యాంకర్ అడిగింది. బదులుగా గోపిచంద్ ప్రభాస్‌తో చేస్తా, క్యారెక్టర్ అంతా ఏమి చూసుకోను, ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తా అంటూ ప్రభాస్‌తో సాన్నిహిత్యాన్ని గుర్తుచేశాడు. వీరిద్ధరు ఇండస్ట్రీలోకి రాకముందు నుండే పరిచయమయ్యారు. వర్షం సినిమాతో క్లోజ్ అయ్యారు. గోపిచంద్‌కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ అంటూ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.
పక్కాకమర్షియల్ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ, రావురమేష్ కీలకపాత్రల్లో నటించారు. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 26న జరుగునుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు గెస్ట్‌గా రాబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

