Titanic Movie | టైటానిక్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే?
వైన్ బాటిల్ ఎంత పాతదైతే అంత టేస్ట్ వచ్చినట్లు కొన్ని సినిమాలు ఎంత పాతవైనా కొత్త ఫీల్‌ను ఇస్తుంటాయి. అలాంటి సినిమాల్లో 'టైటానిక్' ఒకటి. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాను టీవీల్లో, ఫోన్లలో చూసుంటాం.
Titanic Movie Re-Release | వైన్ బాటిల్ ఎంత పాతదైతే అంత టేస్ట్ వచ్చినట్లు కొన్ని సినిమాలు ఎంత పాతవైనా కొత్త ఫీల్‌ను ఇస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘టైటానిక్’ ఒకటి. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాను టీవీల్లో, ఫోన్లలో చూసుంటాం. అయినా గానీ ఇప్పటికీ టెలికాస్ట్ అవుతుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి ఎవర్గ్రీన్ క్లాసికల్ మూవీ టైటానిక్. విషాదభరిత ప్రేమకథను ఇంత గొప్పగా, పోయేటిక్‌గా జేమ్స్ కామెరూన్ తప్ప ఎవరూ తీయలేరని బల్ల గుద్ది చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎన్నో ఐకానిక్ సన్నివేశాలు ఉన్నాయి. షిప్పు మునిగిపోయే సన్నివేశం, షిప్పులో ఉన్న జనాలు ప్రాణాలు కోల్పోయే క్రమంలో ఏర్పడే భావోద్వేగాలు ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. ఇక లియోనార్డో డికాప్రియో, కేన్ విన్స్లెట్ జోడీ మంత్ర ముగ్ధుడవని ప్రేక్షకుడు లేడు. కాగా ఈ సినిమా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.
టైటానిక్ సినిమా ఇప్పటికే ఇండియాలో రీ-రిలీజ్ అయింది. కాగా తాజాగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా నాలుగు రోజుల ముందే ఫిబ్రవరి 10న 4కే ప్రింట్‌తో ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది. 1997 నవంబర్‌లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 13వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. బిలియన్ డాలర్ మార్కు అందుకున్న మొదటి సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగానూ ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ అత్యధిక ఆస్కార్డులు గెలుచుకున్న రికార్డు టైటినిక్ పైనే ఉన్నాయి.
ఇక గతేడాది జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ కూడా రీ-రిలీజైంది. రీ-రిలీజ్లోనూ భారీ కలెక్షన్లు సాధించి ‘అవతార్-2’ పై మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక డిసెంబర్లో రిలీజైన అవతార్-2 మొదటి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లను సాధిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 15వేల కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

